Home Page SliderTelangana

రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

సెక్రటేరియట్ ఎదుట మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, దీపాదాస్, కోమటిరెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకపూజలు నిర్వహించారు.