జిల్లాల పర్యటనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
టిజి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులతో సమావేశంలో వెల్లడించారు. వారానికో జిల్లా పర్యటన ఉండేలా షెడ్యూల్‌ని త్వరలో విడుదల చేస్తామన్నారు. పథకాలు, అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తానని చెప్పారు. చాలా జిల్లాల్లో కలెక్టర్లు ఆఫీసులు దాటడం లేదని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులంతా క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లేలా చూడాలని సీఎస్‌ను ఆదేశించారు.