మహబూబ్‌నగర్‌లో మొక్కలు నాటిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
టిజి: మహబూబ్‌నగర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మహబూబ్‌నగర్ కలెక్టరేట్ ఆవరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాజనర్సింహ పాల్గొన్నారు. అయితే మరికాసేపట్లో మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌లో అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించనున్నారు.

