టీఎస్పీఎస్సీ ఛైర్మన్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్స్
టీఎస్పీఎస్సీ ఛైర్మన్, అధికారులపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఈ ఛైర్మన్, అధికారులు పల్లీ బఠానీలలాగ పరీక్ష పేపర్లు మార్కెట్లో దొరికే పరిస్థితులు కల్పించారని, వారు ఇప్పటికే రాజీనామాలు సమర్పించారని తెలిపారు. కొత్త ఛైర్మన్‌పై గవర్నర్ అనుమతి లభించిన వెంటనే, ఛైర్మన్‌ను నియమిస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా సంవత్సరం తిరిగేలోపు 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని పేర్కొన్నారు. విద్యార్థులెవ్వరూ ఆందోళనలు చెందవద్దని, తప్పకుండా ఉద్యోగ నియామకాలపై త్వరలోనే ప్రకటన ఉంటుందని హామీ ఇచ్చారు.

