డిఎస్ మృతిపట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం
టిజి: మాజీ పీసీసీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షునిగా పనిచేసిన డీఎస్.. కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. సామాన్య స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎదిగిన డీఎస్ రాజకీయ నేతలెందరికో ఆదర్శంగా నిలిచారని స్మరించుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

