Home Page SliderTelangana

భారీ పెట్టుబడులతో హైదరాబాద్‌కు ముఖ్యమంత్రి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగపూర్, దావోస్‌లలో పర్యటనలు ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. శంషాబాద్ విమానాశ్రయం వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. దావోస్‌లో భారీగా రూ.1,78,950 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకుని వచ్చిన ముఖ్యమంత్రిని కార్యకర్తలు కొనియాడారు. ఈ తాజా పెట్టుబడులతో రాష్ట్రానికి 50 వేల ఉద్యోగాలు రానున్నాయని రేవంత్ రెడ్డి తెలిపారు. దాదాపు 20 ప్రతిష్టాత్మక సంస్థలతో ఈ ఒప్పందాలు కుదిరినట్లు పేర్కొన్నారు.