నేడు రెండు చోట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన?
తెలంగాణలో షెడ్యూల్ ప్రకారం సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు రెండు చోట్ల పర్యటిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, ఇల్లెందు ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన పాల్గొనాల్సి ఉంది. అయితే అంతకుముందు ఆయన ఎర్రవల్లిలో మూడు రోజుల పాటు జరిగే రాజశ్యామల యాగంలో పాల్గొంటారు. ఇప్పటికే సీఎం ఎర్రవల్లికి చేరుకున్నారు. ఈ క్రమంలో సభలకు హాజరుపై స్పష్టత రావాల్సి ఉంది.

