ముఖ్యమంత్రి గుడివాడ టూర్ ఫిక్స్
ఏపీ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడివాడ పర్యటనకు ఈ నెల 15న రానున్నారు. ఆగస్ట్ 15న అన్న క్యాంటీన్లను సీఎం గుడివాడలో ప్రారంభిస్తారు. ఉదయం 6.30 గంటలకు ప్రారంభిస్తారని సమాచారం. తొలి విడతలో 100 క్యాంటీన్లను ప్రభుత్వం అందుబాటులోకి తేనుంది. వీటికి ఆహార సరఫరా బాధ్యతలను హరేకృష్ణ ఫౌండేషన్ సంస్థ దక్కించుకుంది.

