వైసీపీకి గుడ్‌బై చెప్పిన బాలినేని
వైసీపీ పార్టీకి గట్టి షాక్ తగిలింది. వైసీపీ ముఖ్యనేత బాలినేని శ్రీనివాస రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను వైసీపీ నేత జగన్‌కు అందజేశారు. ఆయనతో జగన్‌కు బంధుత్వం ఉన్న సంగతి తెలిసిందే. బాలినేని మీడియాతో మాట్లాడుతూ రాజకీయాలు వేరు, బంధుత్వాలు వేరు అని పేర్కొన్నారు. రాజకీయాలలో భాష గౌరవంగా, హుందాగా ఉండాలని పేర్కొన్నారు. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. తాను విలువలు నమ్ముకుని ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, హుందాగా వ్యవహరించారని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేశానన్నారు. రెండుసార్లు మంత్రిగా పనిచేశానని పేర్కొన్నారు. జగన్ నిర్ణయాలు సరిగ్గా లేనప్పుడు తాను వ్యతిరేకించానన్నారు. రేపు పవన్ కళ్యాణ్‌ను కలుస్తారని, జనసేనలో చేరుతారని సమాచారం.

