Andhra PradeshHome Page Slider

 వైకాపా నేతల కనుసన్నల్లో కోడి పందేలు.. భారీగా వాహనాలు పట్టివేత!

దెందులూరు: వైకాపా నేతల కనుసన్నల్లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న కోడి పందేల శిబిరంపై ఎస్ఈబీ పోలీసులు దాడిచేసి భారీగా వాహనాలను పట్టుకున్నారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం చక్రాయగూడెంలోని కోడి పందేల శిబిరంపై ఆదివారం తెల్లవారు జామున పోలీసులు దాడి చేశారు. వైకాపా నేతల కనుసన్నల్లో శనివారం రాత్రి ఇక్కడ జరిగిన పందేల్లో దెందులూరు, ఏలూరు, చింతలపూడి నియోజకవర్గాలకు చెందిన పందెంగాళ్లు దాదాపు 1500 మంది పాల్గొన్నట్లు సమాచారం. వీరిలో అధికార పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు ఉన్నట్లు తెలిసింది. పోలీసుల దాడిలో ఇతర ప్రాంతాలకు చెందినవారు తప్ప స్థానికులు పట్టుబడకపోవడం గమనార్హం. శిబిరం వద్దకు వందకు పైగా కార్లు, 200 కు పైగా ద్విచక్ర వాహనాలు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. పోలీసులు మాత్రం 70 ద్విచక్ర వాహనాలు, 38 కార్లు, 27 మంది పందెంరాయుళ్లు, 26 కోళ్లు, 34 సెల్‌ఫోన్లు, రూ.90 వేల నగదు పట్టుకున్నట్లు ప్రకటించారు.