Home Page SliderNational

చియాన్ విక్రమ్ కోబ్రా కథ ‘అత్యంత ఖరీదైనది’

దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు ఇటీవలి పోడ్‌కాస్ట్‌లో చియాన్ విక్రమ్ చిత్రం ‘కోబ్రా’ పరాజయం గురించి తెలియజేశారు. కథలో లోపాలు ఉన్న మాట వాస్తవమే, తాను పని చేయకూడదని అనుకున్నానన్నారు. ‘డిమాంటే కాలనీ 2’ విడుదల కోసం ఎదురుచూస్తున్న తమిళ దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు ఇటీవలి పోడ్‌కాస్ట్‌లో చియాన్ విక్రమ్ ‘కోబ్రా’ పరాజయం గురించి మాట్లాడారు. చిత్ర నిర్మాత ఎస్ఎస్ మ్యూజిక్‌తో మాట్లాడుతూ, ‘కోబ్రా’ ప్రధాన కథ తనది కాదని, దానిని నిర్మాత తనకిచ్చారని చెప్పారు. తన టీమ్‌తో కలిసి సినిమా వన్‌లైనర్‌కి పనిచేయడం తన కెరీర్‌లో ఖరీదైన తప్పుగా భావించాను, ఎందుకంటే కోర్ స్టోరీలో లోపాలు ఉన్న మాట వాస్తవమే. చియాన్ విక్రమ్ ‘కోబ్రా’ అన్నివర్గాల నుండి ప్రతికూల సమీక్షలను అందుకుంది. సినిమా విడుదలైన రెండేళ్ల తర్వాత తెర వెనుక ఏం జరిగిందో దర్శకుడు వివరించాడు.

“సెవెన్ స్క్రీన్ స్టూడియోకి చెందిన నిర్మాత లలిత్ కుమార్ వద్ద నేను స్క్రిప్ట్ తీసుకున్నాను. అది మొదట రిజెక్ట్ చేయబడింది. తర్వాత, నేను మరొక రచయిత వద్దకు స్క్రిప్ట్‌తో వెళ్లాను, అది మళ్లీ రిజెక్టెడ్‌. ఒక దశలో నిర్మాతే ఇచ్చారు. స్క్రిప్ట్‌లో కొన్ని తప్పులు ఉన్నాయని నేను భావించాను, కానీ మేము దానిని మార్చలేము కదా…