NationalNews

ఛత్తీస్‌గఢ్‌ సీఎంకు కొరడా దెబ్బలు

ఛత్తీస్‌గఢ్‌లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. మంగళవారం ఉదయం దుర్గ్‌ జిల్లాలోని జజంగిరి గ్రామంలో గోవర్ధన్‌ పూజలో ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్‌ బాఘెల్‌ పాల్గొన్నారు. గౌరీ దేవికి ప్రత్యేక పూజలు చేసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు.  ఈ పూజలో పాల్గొన్న భక్తులు కొరడా దెబ్బలను కూడా కాచుకుంటారు. మిగతా భక్తులలాగే సీఎం బాఘెల్‌ కూడా కొరడా దెబ్బలు తిన్నారు. దీనివల్ల విఘ్నాలు తొలగిపోతాయని జజంగిరి గ్రామస్థుల నమ్మకం.. ఈ నమ్మకాన్ని, ఆచారాన్ని ముఖ్యమంత్రి బాఘెల్‌ కూడా పాటిస్తారు. ప్రతి ఏటా దీపావళిని పురస్కరించుకొని తర్వాతి రోజు జరిగే గోవర్ధన్‌ పూజలో పాల్గొంటారు. అనంతరం ఈ వీడియోను సీఎం తన ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.