చెరువుగా మారిన చెన్నై..
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వరుణుడి బీభత్సం కొనసాగుతున్నది. తమిళనాడు రాజధాని చెన్నైలోని దాదాపు అన్ని ప్రాంతాలు చెరువుల్లా మారాయి. గంట గంటకు వర్షం అంతకంతకు పెరుగుతున్నది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించింది. ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. చెన్నై, తిరువళ్లూరు, చెంగల్ పట్టు, కాంచీపురానికి వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. ఈ క్రమంలో తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్లో పరిస్థితులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

