చెన్నై సూపర్ ప్లాన్..చవకగా ధోనీ రిటైన్
ఐపీఎల్ రిటెన్షన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చాలా తెలివిగా అడుగులు వేసింది. నిన్న జరిగిన రిటెన్షన్‌లో ఎంఎస్ ధోనీని చాలా చవకగా స్టార్ ప్లేయర్ ధోనీని రిటైన్ చేసుకున్నారు. గత సంవత్సరం రూ.12 కోట్లకు తీసుకున్న ధోనీని ఇప్పుడు రూ.4 కోట్లకే దక్కించుకుంది చెన్నై. అయితే దీనికి కారణం, ధోనీ అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ కావడమే. గత ఐదేళ్లలో ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఆడకపోతే వారిని అన్‌క్యాప్డ్ ప్లేయర్లుగా పరిగణిస్తారు. ధోనీ ఇంటర్నేషనల్ మ్యాచ్ నుండి రిటైర్ కావడంతో ఆయనను కేవలం రూ.4 కోట్లకే రిటైన్ చేసుకుని ఈ అవకాశం తీసుకుంది చెన్నై.