Home Page SliderNationalSportsviral

ప్లేఆప్స్ రేస్ నుండి చెన్నై ఔట్..ధోనీ కీలక నిర్ణయం

ఐపీఎల్ 2025లో మొట్టమొదటిగా ఇంటిదారి పట్టిన టీమ్‌గా నిలిచింది చెన్నై సూపర్ కింగ్స్. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో మరోసారి చెన్నై ఓటమిని చవిచూసింది. ఈ ఓటమితో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు ఇక ఈసీజన్‌లో ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకున్నట్టే అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ధోని రిటైర్మెంట్‌ విషయం ట్రెండింగ్‌లోకి వస్తోంది. అయితే బుధవారం మ్యాచ్‌ టాస్‌ సమయంలో రిటైర్మెంట్‌పై ధోని సడన్ షాక్ ఇచ్చాడు. ‘నువ్వు నెక్ట్స్‌ ఇయర్‌ కూడా చెపాక్‌కు వచ్చి ఆడుతావా?’ అని కామెంటేటర్ అడిన ప్రశ్నకు.. ఎంఎస్‌ ధోని సమాధానం ఇస్తూ ..తాను నెక్స్ట్ ఇయర్ కాదు కదా నెక్ట్స్‌ మ్యాచ్‌కే వస్తానో లేదో తెలియదంటూ అభిమానుల గుండెల్లో బాంబు పేల్చాడు. చెన్నై జట్టు ప్రదర్శన మరోసారి అభిమానులను నిరాశ పరిచింది. గత రెండు సీజన్లుగా ప్లేఆప్స్‌కు కూడా చేరడం లేదు.