తిరుమల నడకదారిలో చిక్కిన చిరుత పిల్ల -తల్లి కోసం వేట
అలిపిరి నుండి తిరుమల వెళ్లే నడక దారిలో రెండ్రోజుల క్రితం నాలుగేళ్ల బాలుడిని నోటకరుచుని వెళ్లిన చిరుతను ఎట్టకేలకు పట్టుకున్నారు అటవీ సిబ్బంది. గాయాలతో బయటపడ్డాడు బాలుడు. అయితే ఈ చిరుత వయస్సు ఏడాదిన్నర ఉంటుందని పేర్కొన్నారు. ఇది చిన్న పిల్ల కావడంతో దీని తల్లి చిరుత కూడా అక్కడ దగ్గరలోనే ఉండొచ్చని వార్తలు వెలువడుతున్నాయి. దీనికోసం ప్రణాళికను సిద్దం చేశారు అటవి అధికారులు. దానిని పట్టుకోవడానికి ఆరు కిలోమీటర్ల పరిధిలో కెమెరాలు ఏర్పాటు చేశారు. త్వరలోనే పట్టుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. యాత్రికులు రాత్రి సమయంలో గుంపులుగా మాత్రమే అలిపిరి మెట్లపై వెళ్లాలని, గోవింద నామస్మరణ చేసుకుంటూ వెళ్లాలని సూచించారు.

