Home Page SliderTelangana

కల్తీ ఐస్‌క్రీమ్స్ సెంటర్స్‌లో తనిఖీలు- ‘బెస్ట్‌’ బ్రాండ్ ఐస్‌క్రీమ్ కంపెనీ సీజ్

“మేడిపండు చూడ మేలిమై ఉండు.. పొట్టవిప్పిచూడ పురుగులుండు” అన్న చందంగా హైదరాబాద్ చందానగర్‌లోని ఐస్‌క్రీమ్ తయారీ కేంద్రాలు ఉన్నాయి. మాదాపూర్ పోలీసులు, ఎస్వోటీ పోలీసులు జాయింట్‌గా చేసిన ఈ ఆపరేషన్‌లో ఒళ్లు గగుర్పొడిచే విషయాలు తెలిసాయి. అపరిశుభ్రమైన తుప్పు పట్టిన డ్రమ్ములు,వాటిలో కలిపిన రంగునీరు, ప్లేవర్లు. ఇవి చూసారంటే జన్మలో ఐస్‌క్రీమ్‌ జోలికి పోకూడదనిపిస్తుంది. ఇలాంటి విషాన్నా… మన పిల్లలకు ఇష్టంగా కొనిస్తున్నాము అనిపిస్తుంది. ఏ రకమైన నియమాలు, ఆహారనాణ్యతకు సంబంధించిన ప్రమాణాలు లేకుండా తయారు చేస్తున్నారు.

అడిగేవారెవరూ లేరని లాభాల ఆశతో ఎంతకైనా తెగిస్తున్నారు తయారీదారులు. ఈ కేసులో ఇప్పటికే శ్రీనివాస్ రెడ్డి అనే తయారీదారుడిని అరెస్టు చేశారు. ఐదేళ్లుగా ఈ కంపెనీ అడ్డులేకుండా తయారీని కొనసాగిస్తోంది. ఇలాంటి ఐస్‌క్రీమ్స్, చాక్లెట్స్ తినడం వల్ల దంత వ్యాధులు, జీర్ణసంబంధవ్యాధులు, ఒబేసిటీ, హృదయరోగాలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెపుతున్నారు.