రూమర్స్‌కి చెక్..పెళ్లి డేట్ ఫిక్స్..
కోలీవుడ్ హీరో విశాల్, హీరోయిన్ సాయి ధన్సిక పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇక రూమర్స్‌కి చెక్ పెట్టి పెళ్లి ముహూర్తం ప్రకటించారు. చెన్నైలో నిర్వహించిన సాయిధన్సిక నటించిన చిత్రం యోగీ దా ఆడియో, ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు విశాల్ అతిథిగా హాజరయ్యారు. అదే వేదిక నుండి వారిద్దరూ అభిమానులకు తమ పెళ్లి వార్తను చెప్పారు. సాయి ధన్సిక పెళ్లి డేట్‌ను ప్రకటించారు. విశాల్ బర్తడే రోజైన ఆగస్టు 29నే వారిద్దరూ వివాహం చేసుకోబోతున్నారు. పెళ్లి గురించి సాయి ధన్సిక మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.