Home Page SliderTelangana

హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ సంస్థ ఛీటింగ్

హైదరాబాద్‌లోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సాయిసూర్య డెవలపర్స్ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. కస్టమర్లను నిలువునా ముంచేసింది ఈ సంస్థ. వెంచర్ల కోసం డబ్బులు వసూలు చేసి, 2022 డిసెంబర్ నాటికి ప్లాట్లు ఇస్తామని మాట ఇచ్చిన సాయి సూర్య డెవలపర్స్ గడువు దాటి ఏడు నెలలవుతున్నా ఇవ్వకపోవడంతో కస్టమర్లు మండిపడ్డారు. ఆ భూములను సేల్ డీడ్ చేసి అమ్ముకున్నారంటూ పోలీసులకు కంప్లైంట్ చేసారు. దీనితో వారిపై ఛీటింగ్ కేసు నమోదు అయ్యింది.