Home Page SliderNational

డిజిటల్ అరెస్ట్ పేరుతో వర్దమాన్‌ బాస్‌ను 7 కోట్లకు చీట్ చేసిన కేటుగాడు

కాదేదీ కవితకు అనర్హమని శ్రీశ్రీ ఏనాడో చెప్పాడు. అదే రీతిలో మోసగాళ్లు చీట్ చేసే ఏ అవకాశాన్ని వదలడం లేదు. తాజాగా అంతకంతకూ పెరుగుతున్న డిజిటల్ రూపాన్ని వినియోగించుకొని సామాన్యుల నుంచి బడా బాబులను లూటీ చేస్తూనే ఉన్నారు. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్‌ వేషంతో మోసం చేసిందో టీమ్. ఒరిజినల్ కోర్ట్ రూమ్‌ని పోలి ఉండే డాక్యుమెంట్‌లతో నకిలీ వర్చువల్ కోర్టు గది నుంచి మాట్లాడుతూ వర్ధమాన్ గ్రూప్ హెడ్ SP ఓస్వాల్ ₹ 7 కోట్లకు మోసగించాడు. టెక్స్‌టైల్ తయారీదారు ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఓస్వాల్‌ను ఆగస్టు 28, 29 తేదీల్లో “డిజిటల్ అరెస్ట్” చేసినట్టుగా డ్రామా ఆడి ₹ 7 కోట్లను పలు ఖాతాల్లో మళ్లించుకున్నారు. మొత్తం వ్యవహారాన్ని జాగ్రత్తగా డీల్ చేసిన ఓస్వాల్ చాకచక్యంతో పోలీసులు కొన్ని ఖాతాలను స్తంభింపజేసి, ₹ 5 కోట్లకు పైగా రికవరీ చేశారు. మనీలాండరింగ్ కేసు విచారణ జరుగుతుందని చెప్పి, మోసగాళ్లు తనను ఎలా చీట్ చేశారో పూసగుచ్చి మరీ చెప్పారు 82 ఏళ్ల పారిశ్రామికవేత్త ఓస్వాల్.

చీటింగ్ ఇలా మొదలుపెట్టారు!
సెప్టెంబర్ 28 (శనివారం)న తనకు ఫోన్ కాల్ వచ్చిందని ఓస్వాల్ తెలిపారు. కాల్ వచ్చినప్పుడు తాను 9 నెంబర్ బటన్‌ నొక్కితే ఫోన్ డిస్‌కనెక్ట్ అవుతుందని వారు హెచ్చరించారన్నాడు. 9వ నెంబర్ నొక్కిన వెంటనే, CBI Colaba కార్యాలయం నుండి కాల్ చేస్తున్నట్లు వాయిస్ వచ్చిందన్నారు. తన మొబైల్ ఫోన్ నంబర్‌ను ఆధార్ ఉపయోగించి కనెక్షన్ తీసుకున్నారని వివరించాడు. ఓస్వాల్ పేరు మీద కెనరా బ్యాంక్ అకౌంట్ ఉందని చెప్పగా, తనకు అలాంటి ఖాతా లేదని చెప్పినప్పుడు, అకౌంట్ ఉందని, ఆ లావాదేవీలలో కొన్ని ఆర్థిక అవకతవకలు జరిగాయని అధికారి బదులిచ్చినట్టు తెలిపారు. మనీలాండరింగ్ దర్యాప్తులో గత ఏడాది అరెస్టయిన జెట్ ఎయిర్‌వేస్ మాజీ ఛైర్మన్ నరేష్ గోయల్‌పై కేసుకు సంబంధించిన ఆర్థిక అవకతవకలను తనకు వివరించి, వీడియో కాల్‌ ద్వారా మోసగాళ్లు కుట్ర పన్నారని చెప్పారు. “నేను కేవలం అనుమానితుడిని అని వారు నాకు చెప్పారు. ఇది నా ఖాతా కాదని, నరేష్ గోయల్ నాకు తెలియదని నేను వారికి చెప్పాను. నా ఆధార్ వివరాలను ఉపయోగించి ఖాతా తెరిచినట్లు వారు చెప్పారు. జెట్ ఎయిర్‌వేస్‌లో ప్రయాణించానని వారికి చెప్పడంతో, నిజమని భావించి వివరాలు చెప్పానన్నారు.

ఆ అధికారి పేరుతో కుట్ర చేశారని అప్పుడే తనకు అర్థమైందన్నారు ఓస్వాల్. “తమ విచారణ ముగిసే వరకు అనుమానితుడినేనని, డిజిటల్ కస్టడీలో ఉన్నానని వారు చెప్పారు. వారు నన్ను రక్షించడానికి ప్రయత్నిస్తారని, నమ్మి నగదు పంపించానన్నారు. వీడియో కాల్‌లో ఒక సమయంలో, ఒక వ్యక్తి తనను తాను చీఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రాహుల్ గుప్తాగా వ్యవహరించాడని ఓస్వాల్ చెప్పారు. నిఘా నియమాలను పంపాడని, అక్కడ దాదాపు 70 నియమాలు ఉన్నాయన్నారు. అధికారులలా నటిస్తూ మోసగాళ్లు తన వాంగ్మూలాన్ని నమోదు చేశారని పారిశ్రామికవేత్త తెలిపారు. “నా చిన్నతనం, చదువు, వ్యాపార ప్రవేశం గురించి అడిగారు. ఆస్తి వివరాలు అడిగారు. అవన్నీ గుర్తుండవని చెప్పాను కానీ మా మేనేజర్‌తో మాట్లాడిన తర్వాత చెబుతాను” అని చెప్పానన్నాడు. ఓస్వాల్ తాను రాత్రింబవళ్లు వీడియో నిఘాలో ఉన్నానని చెప్పారు. ” గది నుండి బయటకు వెళ్ళినప్పుడల్లా, వారు చూడగలిగేలా నా ఫోన్‌ని తీసుకువెళ్లాను.” అని చెప్పారు. మొత్తం వ్యవహారం జాతీయ రహస్యాల చట్టం కింద ఉన్నందున ఎవరితోనూ మాట్లాడకూడదని వారు హెచ్చరించాడనన్నారు. నేను ఎవరితో మాట్లాడినా మూడు నుండి ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని వారు చెప్పారన్నాడు.

విచారణ సంస్థ అధికారులుగా నటిస్తున్న మోసగాళ్లు సివిల్ డ్రెస్‌లో ఉన్నారని, వారి మెడలో ID కార్డులను ధరించారని ఓస్వాల్ చెప్పారు. బ్యాక్‌గ్రౌండ్‌లో భారత జెండా ఉన్న కార్యాలయం కనిపించిందన్నాడు. వీడియో కాల్ సమయంలో, ఆక్టోజెనేరియన్‌కు నకిలీ కోర్టు గదిని కూడా చూపించారు. భారత ప్రధాన న్యాయమూర్తి DY చంద్రచూడ్‌గా నటిస్తున్న వ్యక్తి అతని వాదనను విని ఒక ఉత్తర్వు జారీ చేశాడు. వాట్సాప్ సందేశం కూడా పంపారు. దీంతో వేర్వేరు ఖాతాలలో ₹ 7 కోట్లు డిపాజిట్ చేయమని చెప్పారన్నాడు. ఓస్వాల్‌కు అందించిన నకిలీ అరెస్ట్ వారెంట్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మోనోగ్రామ్ ఉంది. ED ముంబై పోలీసుల స్టాంపులు ఉన్నాయి. ఇది ED అసిస్టెంట్ డైరెక్టర్‌గా గుర్తించబడిన నీరాజ్ కుమార్ సంతకం కూడా ఉంది. ED అందించిన నిజమైన అరెస్ట్ వారెంట్‌పై ముంబై పోలీసుల స్టాంప్ లేదు.

సుప్రీం కోర్ట్ ఆర్డర్ ప్రకారం ఒక డాక్యుమెంట్‌లో మూడు రెవిన్యూ స్టాంపులు ఉన్నాయి. టాప్ కోర్ట్ స్టాంపు, బార్ అసోసియేషన్ స్టాంపు కూడా ఉన్నాయి. అదే సమయంలో వారెంట్‌పై డిజిటల్ సంతకం ఉంది. అవి సుప్రీంకోర్టు వాస్తవ ఆర్డర్‌లో కనిపిస్తాయి. అలాగే, రిట్ పిటిషన్ “జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ వర్సెస్ శ్రీ పాల్ ఓస్వాల్” అని పేర్కొంది. పత్రాలు, స్టాంపులపై సుప్రీం కోర్టు చిహ్నం ఉంది. నిజాయితీగా చెప్పాలంటే, వారు నన్ను రక్షించబోతున్నారని బెదిరింపులు, హామీలతో నేను తీసుకున్నాను” అని ఓస్వాల్ చెప్పారు.

ఓస్వాల్ ఫిర్యాదు మేరకు ఆగస్ట్ 31న పోలీసులు కేసు నమోదు చేశారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ సహాయంతో, డబ్బు బదిలీ చేసిన మూడు ఖాతాలను స్తంభింపజేసి, పారిశ్రామికవేత్త ₹ 5.25 కోట్లు తిరిగి పొందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, భారతదేశంలో ఇలాంటి కేసులో ఇది అతిపెద్ద రికవరీ. అంతర్ రాష్ట్ర ముఠా ఈ నేరానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరు నిందితులు అటాను చౌదరి, ఆనంద్ కుమార్‌లను అసోంలోని గౌహతిలో అరెస్టు చేశారు. ఇద్దరూ చిరు వ్యాపారులేనని తేలింది. తనకు డబ్బు అవసరమని ఆనంద్ కుమార్ పోలీసులకు చెప్పాడు. గేమింగ్ ప్రైజ్ ఫండ్స్‌ను వసూలు చేసేందుకు ఖాతా ఉపయోగించేందుకు తనకు వాటా వస్తుందని ముఠా సభ్యులు చెప్పారని చెప్పాడు. “మేము ₹ 2 కోట్లకే ఓకే చెప్పినా, ఖాతాలోకి 9 కోట్ల 20 లక్షల రూపాయలు వచ్చాయి.” అని చెప్పాడు. కేసులో మిగిలిన నిందితులు నిమ్మి భట్టాచార్య, అలోక్ రంగి, గులాం ముర్తాజా, జకీర్‌గా గుర్తించారు. మొత్తం వ్యవహారంలో ప్రధాన సూత్రధారి మాజీ బ్యాంక్ ఉద్యోగి రూమీ కాలితా సహా ఇతర నిందితుల కోసం పోలీసులు ఇప్పుడు వెతుకుతున్నారు.