Home Page SliderLifestyleNationalviral

పుచ్చకాయను సెలక్ట్ చేసిన చాట్‌జీపీటీ..

చాట్‌జీపీటీని ఏ ప్రశ్న అయినా అడగండి సవాల్ అంటూ యూజర్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇటీవల ఎండలు మండిపోతుండడంతో చల్లగా, హెల్తీగా పుచ్చకాయలు తింటున్నారు ప్రజలు. అయితే తియ్యటి పుచ్చకాయ సెలక్షన్‌లో వెనకబడి మంచి కాయలు కొనుక్కోలేని వాళ్లకు ఓపెన్ ఏఐ చాట్‌జీపీటీ సహాయం చేస్తోంది. తాజాగా పుచ్చకాయ సెలక్షన్‌లో చాట్‌జీపీటీ ఇచ్చిన సలహాతో మంచి పుచ్చకాయను సెలక్ట్ చేశాడో యువకుడు. పుచ్చకాయను ఫోటోలు తీస్తూ, తియ్యటి, ఎర్రటి పుచ్చకాయను సెలక్ట్ చేయమని అడుగగా చాట్‌జీపీటీ బదులిచ్చింది. ఆ కాయ ఎర్రగా, టేస్టీగా ఉండడంతో సంతోషంగా సోషల్ మీడియాలో ఆ వీడియో పంచుకున్నాడు. యూజర్ల చిన్న చిన్న సమస్యలు కూడా ఏఐ పరిష్కరిస్తోందంటూ సంతోషం వ్యక్తం చేశాడు.