Home Page SlidermoviesNational

ఆసుపత్రిలో చేరిన చారుహసన్

ప్రముఖ సీనియర్ నటి సుహాసిని తండ్రి చారుహసన్ తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. గురువారం రాత్రి ఆయనను చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చినట్లు కుమార్తె సుహాసిని మణిరత్నం సోషల్ మీడియాలో వెల్లడించారు. తమ దీపావళి ఎమర్జెన్సీ వార్డులోనే జరిగిందని, చారుహసన్ ఆపరేషన్‌కు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఆయన విలక్షణ నటుడు కమల్ హాసన్‌కు స్వయానా అన్న. చారు హసన్ వయసు 93ఏళ్లు. ఈ ఆగస్టులోనే ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో చికిత్స తీసుకున్నారు. ఆయన కూడా గతంలో నటుడు, దర్శకుడిగా పనిచేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ చిత్రాలలో నటించారు. కన్నడ చిత్రం ‘తబరన కథ’ అనే చిత్రానికి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు కూడా అందుకున్నారు.