రంగురంగుల్లో మెరిసిపోతున్నచార్మినార్..
హైదరాబాద్‌లోని చారిత్రక కట్టడం చార్మినార్ రంజాన్ వేళ పండుగ శోభను సంతరించుకుంది. రంజాన్ మాసం కావడంతో జోరుగా కొనుగోళ్లు జరుగుతున్నాయి. విద్యుత్ కాంతుల మెరుపులతో, జాతీయ జెండా రంగులో చార్మినార్ మెరిసిపోతోంది. కేవలం హైదరాబాద్ వాసులే కాకుండా ఇతర జిల్లాల నుండి కూడా ఇక్కడకు కొనుగోళ్లకు ప్రజలు పోటెత్తారు. రంజాన్ మాసం సాయంత్రం నుండి రాత్రి తెల్లవార్లూ చార్మినార్ చుట్టుపక్కల వీధులన్నీ కళకళలాడుతున్నాయి.
