బ్రిటన్ కొత్త రాజుగా చార్లెస్
బ్రిటన్ కొత్త రాజు అదుర్స్
భిన్నమైన ఆలోచనలతో గుర్తింపు
అధికారం కోసం వెయిటింగ్ వెయిటింగ్
తల్లి సుధీర్ఘ కాలం పాలించడంతో 73 ఏళ్ల వయసులోనూ యువరాజుగానే బాధ్యతలు నిర్వర్తించాల్సి వచ్చింది. ఇంగ్లాండ్‌కు త్వరలో బాహాటంగా మాట్లాడే వ్యక్తి కొత్త రాజు కాబోతున్నాడు. ఇప్పటి వరకు ఉన్న రాజులకు భిన్నంగా తక్కువ మాట్లాడి ఎక్కువ పనులు చేసే వ్యక్తిగా గుర్తింపు ఉన్న చార్లెస్ త్వరలో బ్రిటన్ పీఠాన్ని అధిరోహించబోతున్నాడు. తల్లి నుంచి బాధ్యతలు చేపట్టాల్సి వస్తుందని చాన్నాళ్లుగా చార్లెస్ ఎదురుచూస్తూ కాలం గడిపారు. చార్లెస్ తల్లి, క్వీన్ ఎలిజబెత్ II వృద్ధాప్యంలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ… 73 ఏళ్ల చార్లెస్ వారసుడిగానూ రికార్డు బద్దలు కొట్టాడు. బ్రిటన్ రాజు లేదా రాణిగా రిటైర్మెంట్ అన్నది లేనందున బాధ్యతల కోసం వెయిట్ చేయాల్సిందేనంటూ పదేపదే చార్లెస్ చెప్పేవాడు.

ప్రజల జీవితాలను మెరుగుపరచడంలో తన తల్లికి సహాయం చేయడం కర్తవ్యంగా భావించాడు. హృదయానికి దగ్గరగా ఉన్న సమస్యలపై, ముఖ్యంగా వాస్తుశిల్పం, పర్యావరణం, వ్యవసాయం, నమ్మకాలు, ప్రత్యామ్నాయ వైద్యం గురించి బహిరంగంగా అనేక వ్యాఖ్యలు చేశాడు. కానీ ఆయన అభిప్రాయాలను ఆమోదించిన దాఖలాలు పెద్దగా లేవనే చెప్పాలి. ఆయన ఆలోచనలు విపరీతమైనవిగా, అసంబద్ధమైనవిగా కొట్టివేయబడేవి. కొందరు యువరాజైనప్పటికీ ఆయనను ఎగతాళి కూడా చేసేవారు. కానీ వేటినీ ఆయన లెక్కచేసేవాడు కాదు. నిజాయితీతో ఏ పనైనా చేస్తే అందుకు ప్రతిఫలం వస్తుందని… కాకుంటే కొంత ఆలశ్యమవుతుందని ఆయన చెప్పేవారు.

జనవరి 2020లో, దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో గ్లోబల్ వార్మింగ్, పర్యావరణ నష్టం గురించి వ్యాపార నాయకులను ఆయన హెచ్చరించాడు. ప్రపంచంలో వ్యాపారం ద్వారా సంపాదించిన అదనపు సంపద అంతా విపత్కర పరిస్థితుల్లో కాలిపోవడాన్ని చూడటం తప్ప, దానితో మీరు ఏమీ చేయలేకపోతే ఏమి ప్రయోజనం అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఇంగ్లండ్‌లో కొత్త పట్టణాన్ని నిర్మించి, సేంద్రీయ ఆహార శ్రేణిని ప్రారంభించి ఆరోగ్యం ఆవిశ్యకతను వివరించాడు. మొత్తంగా రాజకీయంగా గందరగోళంగా ఉన్న బ్రిటన్ లో రాజు పాత్ర వచ్చే రోజుల్లో కీలకం కానుంది. ఐతే చార్లెస్ బాధ్యతలు చేపట్టడానికి కొంత కాలం పట్టే అవకాశముందని ప్రచారం జరిగినా ఆయన తక్షణమే రాజుగా రాజకుటుంబం నిర్ధారించింది. నేటి నుంచి ఆయన బ్రిటన్ రాజుగా ప్రాచుర్యం పొందనున్నారు.
