విమానాశ్రయాన్ని తలపించేలా చర్లపల్లి రైల్వేస్టేషన్..
సాంకేతికత, ఆధునికత కలిసిన సకల సౌకర్యాలతో విమానాశ్రయాన్ని తలపించేలా చర్లపల్లి రైల్వేస్టేషన్‌ను రూపొందించారు. దీనికి దాదాపు రూ.413 కోట్లు ఖర్చు అయ్యింది. ఈ టర్మినల్‌ను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. కేంద్ర హోం మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ హాజరయ్యారు. గత ఏడాదే దీనిని ప్రారంభించాల్సి ఉండగా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం కారణంగా వాయిదా పడింది. నేడు ఈ టెర్మినల్ ద్వారా రైల్వే రంగంలో మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం ఇస్తున్నాం. అని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చర్లపల్లి టెర్మినల్ ద్వారా సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్లపై ఒత్తిడి తగ్గుతుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా వందే భారత్, అమృత భారత్, నమో భారత్ వంటి హైస్పీడ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. దీనితో దేశ ముఖచిత్రం మారబోతోందని పేర్కొన్నారు.