Home Page SliderTelanganatelangana,

‘పేరు మార్చడం గొప్పేం కాదు.. అభివృద్ధి చేయాలి’..హరీష్ రావు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. యాదాద్రి పేరు మార్చడం గొప్పేం కాదన్నారు. అభివృద్ధి చేయడం గొప్ప అన్నారు. కేసీఆర్ యాదాద్రిని అభివృద్ధి చేసి చూపించారన్నారు. మూసీ పునరుజ్జీవనానికి తాము వ్యతిరేఖం కాదని, ఆ పేరుతో జరిగే దోపిడీకి మాత్రమే తాము వ్యతిరేఖం అన్నారు. రేవంత్‌కి దమ్ముంటే అంబర్ పేట, అత్తాపూర్ వెళ్లి పాదయాత్ర చేయాలన్నారు. సీఎం పాదయాత్ర చేసినంత మాత్రాన ఏం మునిగిపోదన్నారు. 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ మూసీ నదిని కంపు చేసిందన్నారు. మూసీలోకి మురుగునీరు వెళ్లకుండా 10 ఏళ్లు పాలించిన కేసీఆర్ మాత్రమే చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. రేవంత్ మాటలు, కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు వారి కుటుంబసభ్యులే వినలేకపోతున్నారన్నారు. వెయ్యి కోట్లతో యాదాద్రిని కేసీఅర్ అభివృద్ధి చేయాలన్నారు. రేవంత్ పాదయాత్రలో రైతులను కలవలేదని, చుట్టూ సెక్యూరిటీని, పార్టీ నాయకులను పెట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చారని విమర్శించారు. జోకులు బంద్ చేసి, నిజాయితీగా పనిచేయాలని కోరారు.