Home Page SliderTelangana

పార్టీలు మార్చుడంటే బట్టలు మార్చినంత ఈజీ కాదు

పార్టీ మార్పుపై పదేపదే నాలాంటి వాడిని ప్రశ్నించవద్దంటూ అసహనం వ్యక్తం చేశారు ఈటల రాజేందర్. మీడియాతో మాట్లాడుతూ పార్టీలు మారడమంటే బట్టలు మార్చినంత ఈజీ కాదన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలు అవాస్తవం అని, కాంగ్రెస్ పార్టీ వాళ్లు వాళ్ల పాపులారిటీ కోసం ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తున్నారన్నారు. బీఆర్‌ఎస్ పార్టీపై వ్యతిరేకత ఉందని, కేసీఆర్ గజ్వేల్‌లో ప్రజల కష్టనష్టాలు పట్టించుకోవట్లేదన్నారు. తమ ఎమ్మెల్యే అయిన ముఖ్యమంత్రిని ప్రజలు ఎప్పటికీ కలుసుకోలేకపోతున్నారని, వారికి అందుబాటులో ఉండరని విమర్శించారు. తాము తెలంగాణ కోసం పోరాడింది కేవలం అభివృద్ధి కోసమే కాదని, ఆత్మగౌరవం కోసమన్నారు. బీజేపీలో, కాంగ్రెస్‌లో కూడా కేసీఆర్ తన కోవర్టులను పెట్టుకుని ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇంటి దొంగల విషయంలో అన్ని పార్టీలు జాగ్రత్తగా ఉండాలన్నారు.