మారుతున్న సమీకరణాలు… ముద్రగడ తనయుడు గిరిబాబు పొలిటికల్ బాంబ్..
ముద్రగడ పద్మనాభం తనయుడు గిరిబాబు పొలిటికల్ బాంబు పేల్చారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ముద్రగడ టీడీపీ లేదంటే జనసేనలోకి వెళ్తారన్నారు. వైసీపీలోకి వెళ్లడానికి ముద్రగడ ఆసక్తిగా లేరన్నారు. పార్టీలో చేరిన తర్వాత రాజకీయంగా ఏం చేయాలన్నదానిపై నిర్ణయం ఉంటుందన్నారు. కాకినాడ పార్లమెంట్, ప్రత్తిపాడు, పిఠాపురంలో తాము పోటీకి సిద్ధంగా ఉన్నామన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తామని గతంలోనే చెప్పామన్నారు గిరిబాబు. అన్నింటికీ సిద్ధపడి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నామన్నారు.