Home Page SliderTelangana

అక్టోబర్ 18 నుండి 4 రైళ్ల టైమింగ్స్‌లో మార్పులు

హైదరాబాద్: అక్టోబర్ 18 నుండి సింహపురి, పద్మావతి, నారాయణాద్రి, నాగర్‌సోల్ ఎక్స్‌ప్రెస్ వేళలు మారుతాయని ద.మ.రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్ – గూడూరు సింహపురి (12710) రా.10.35 కి బదులుగా రా.10.05 కి బయలుదేరుతుంది. సికింద్రాబాద్- తిరుపతి పద్మావతి (12764) గూడూరును ఉ.4.43 కి బదులు ఉ.4.19 కి చేరుతుంది. లింగంపల్లి- తిరుపతి నారాయణాద్రి (12734) సా.6.25 కి బదులు సా.5.30 బయలుదేరుతుంది. నర్సాపూర్ – నాగర్‌సోల్ (17231) రా.11.15 కు బదులు రా.9.50 కి స్టార్టవుతుంది. ఇంచు మించుగా ఈ నాలుగు రైళ్ల వేళల్లో ఒక అరగంట ముందుకి జరపబడింది.