Andhra PradeshHome Page Slider

‘మా కాలనీ పేరు మార్చండి’..స్థానికుల ఆందోళన

విజయవాడలోని తమ కాలనీ పేరు మార్చాలంటూ అక్కడి నిర్వాసితులు పట్టుబడుతున్నారు. తమ కాలనీకి ‘పాకిస్థాన్ కాలనీ’ అనే పేరు ఉండడంతో తమకు రావలసిన పలు సౌకర్యాలు రావడం లేదని వారు ఆందోళన చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు వెంటనే స్పందించి, కాలనీ పేరు మార్పుకు సత్వర చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. 1971లో భారత్, పాకిస్థాన్ యుద్ధ సమయంలో సరిహద్దులలోని ప్రజల కోసం విజయవాడ పాయకాపురంలో ఒక కాలనీ ఏర్పాటు చేసి, దానికి ‘పాకిస్థాన్’ పేరు పెట్టారు. ఇప్పుడు కాలనీ పేరు మార్చాలని, తమకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.