ఇప్పటికైనా మారండి.. కాంగ్రెస్ సర్కార్ పై జీవన్ రెడ్డి సీరియస్..
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ అధిష్ఠానానికి లేఖ రాశారు. ‘పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేలతో పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని ఏఐసీసీ చెప్పింద ని మహేశ్ కుమార్ గౌడ్ అంటున్నారు. ఆస్తులు కాపాడుకునేందుకు ఎమ్మెల్యేలు పార్టీ మారారని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ చెప్పారు. సంప్రదాయాలకు విరుద్ధంగా పీఏసీ చైర్మన్ ను నియమించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకోవాలి’ లేఖలో పేర్కొన్నారు.

