ఐపిఎల్ నేపథ్యంలో మెట్రో వేళల్లో మార్పు
హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణించే పాసింజర్స్‌కు ఇది శుభవార్తే అని చెప్పాలి. రైలు సమయాన్ని పొడిగిస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు లాస్ట్ మెట్రో రైలు నైట్ 11 గంటలకు బయలుదేరి 12 గంటలకు గమ్యస్థానానికి రీచ్ అవుతుంది. ఇకపై చివరి మెట్రో రైలు 12 గంటల 15 నిమిషాలకు బయలుదేరి 1:10 నిమిషాలకు గమ్యం చేరుకోనుంది. అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది. నాగోల్, ఉప్పల్ స్టేడియం, ఎన్‌జీఆర్ఐ స్టేషన్‌లలో మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. దీంతో ఉప్పల్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచులు వీక్షించేవారికి.. ఆ మార్గాల గుండా ప్రయాణించేవారికి ఈ సౌకర్యం ఉపయోగకరం.

