విజయవంతంగా నింగికెగసిన చంద్రయాన్-3
చందమామపై అడుగుపెట్టి తీరాలనే ధృఢసంకల్పంతో ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతమయ్యింది. నేటి మధ్యాహ్నం సరిగ్గా 2.35 నిముషాలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి విజయవంతంగా నిప్పులు కక్కుతూ జాబిల్లి దిశగా దూసుకుపోయింది చంద్రయాన్. దీనిని ఎల్‌ఎంవీ-3 అనే రాకెట్ ద్వారా పైకి పంపించారు. ఇది భూకక్ష్యలోకి విజయవంతంగా ప్రయోగించబడింది. భూకక్ష్యలోనే 24 రోజులు పరిభ్రమించి, అనంతరం చంద్రుని దిశగా ప్రయాణం కొనసాగిస్తుంది. భూమిపై నుండి చూడలేని చంద్రుని వెనుకభాగానికి చేరుకోబోతోంది చంద్రయాన్. ఇప్పటి వరకూ ఏ దేశమూ అటువైపు చేరుకోలేదు. ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్‌తో సహా ముఖ్యశాస్త్రవేత్తలు దగ్గరుండి ప్రతి క్షణం ఈ రాకెట్ ప్రయోగాన్ని పర్యవేక్షించారు. సూర్యరశ్మి చేరని చంద్రుని దక్షిణ ధ్రువానికి చేరి, లోతుగా అధ్యయనం చేసి, రహస్యాలను వెలికి తీయడమే చంద్రయాన్ ప్రయాగ లక్ష్యం. చంద్రయాన్‌లో ల్యాండర్, రోవర్ ఉంటాయి. రోవర్ చంద్రునిపై దిగి అధ్యయనం చేస్తుంది.

