యూట్యూబ్‌కు చంద్రబాబు ఆఫర్
ఏపీలో యూట్యూబ్ అకాడమీ ఏర్పాటు చేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ సంస్థకు గొప్ప ఆఫర్ ఇచ్చారు. నేడు యూట్యూబ్ గ్లోబల్ సీఈవో నీల్ మోహన్, గూగుల్ ఏపీ ఏసీ హెడ్ సంజయ్ గుప్తాతో వర్చువల్‌గా సమావేశం అయ్యారు. అమరావతిలో మీడియా సిటీని ఏర్పాటు చేయబోతున్నామని, అక్కడ యూట్యూబ్ అకాడమీని నెలకొల్పాలని ఆయన సంస్థను కోరారు. మీడియా సిటీలో కంటెంట్, స్కిల్ డెవలప్‌మెంట్, ఏఐ, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ వంటి కోర్సులు ప్రవేశపెడతామన్నారు. వాటిపై పరిశోధనలకు కూడా అవకాశం ఇస్తామని, ప్రత్యేక అవకాశాలు ఉంటాయని ఆయన విజ్ఞప్తి చేశారు.