Andhra PradeshHome Page Slider

ప్రధాని మోదీతో ముగిసిన చంద్రబాబు భేటీ

ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. కాగా ఈ భేటీ దాదాపు 45 నిమిషాల పాటు కొనసాగినట్లు తెలుస్తోంది. ఈ భేటీలో ఏపీ సీఎం పలు కీలక అంశాలపై మోదీతో చర్చించినట్లు సమాచారం.ఏపీ ఆర్థిక పరిస్థితులు, పోలవరం, రాజధాని వంటి పలు అంశాల గురించి చంద్రబాబు మోదీకి వివరించారు. అంతేకాకుండా రాష్ట్రానికి ఆర్థిక సాయం,విభజన హామీలపై సీఎం మోదీతో చర్చించారు.కేంద్ర బడ్జెట్‌లో ఏపీ అవసరాలకు తగ్గట్లుగా కేటాయింపులు చేయాలని సీఎం చంద్రబాబు మోదీకి వినతి సమర్పించారు.అయితే అంతకుముందు సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి పియూష్ గోయల్‌తో దాదాపు అరగంట పాటు ముచ్చటించారు.