Andhra PradeshHome Page Slider

రియల్ హీరోకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

రియల్ హీరో సోనూసూద్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఆయనకు ఎక్స్‌లో హ్యాపీ బర్తడే చెప్తూ, “మీరు ఎంతోమంది జీవితాలను మార్చేశారు. పేదలపై మీకున్న దయ, జాలి, ప్రేమ స్పూర్తిదాయకం. మీకు మరింత సంతోషం, విజయాలు లభించాలని భగవంతుని ప్రార్థిస్తున్నానంటూ” పేర్కొన్నారు. చంద్రబాబు నియోజక వర్గం కుప్పంలో పూరీ ఆర్ట్స్ పురుషోత్తం అధ్వర్యంలో సోనూసూద్ పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్ చేశారు. 1200 మంది విద్యార్థులతో ఆయన చిత్రం వచ్చేలా రూపొందించారు.