NTR భవన్‌లో 7న చంద్రబాబుకు సన్మానం
హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ నెల 7న హైదరాబాద్‌లోని ఎన్‌టిఆర్ భవన్‌లో సన్మానం చేయాలని టిటిడిపి నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలు, అభిమానులు తరలిరావాలని పిలుపునిచ్చింది. ఏపీకి ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా ఈ రోజు సాయంత్రం చంద్రబాబు నగరానికి రానున్నారు. ఈ నేపథ్యంలో బేగంపేట ఎయిర్‌పోర్టు నుండి భారీ ర్యాలీ నిర్వహించేందుకు రాష్ట్ర టిడిపి సన్నద్ధమవుతోంది.