తమిళనాడులో పర్యటించనున్న చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు నేడు తమిళనాడులో పర్యటించనున్నారు. కాగా ఆయన కాంచీపురం జిల్లా శ్రీ పెరంబుదూరులోని శ్రీరామానుజర్ ఆలయాన్ని సందర్శించి అక్కడ పూజలు చేయనున్నారు.ఈ మేరకు చంద్రబాబు ఈ రోజు మధ్యహ్నం 2.30 గంటలకు బేగంపేట నుంచి విమానంలో చెన్నైకి బయలు దేరనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఆలయానికి చేరుకోనున్నారు. ఆలయంలో దర్శనం ముగించుకొని ఇవాళ రాత్రి 8.50కు విమానంలో విజయవాడకు వెళ్తారని చెన్నై నగర టీడీపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ తెలిపారు.


 
							 
							