పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు విశిష్ట గౌరవం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనతో సమానంగా విశిష్ట గౌరవం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాలలో, ప్రభుత్వ పథకాలలో చంద్రబాబు ఫొటోతో పాటు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఫొటోలను కూడా పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో, కార్యక్రమాలలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చిత్రపటాలను అమర్చడానకి ఇప్పటికే రంగం సిద్దమయ్యింది. అధికారులు పలు కార్యాలయాలలో వీరిద్దరి ఫొటోలను అమరుస్తున్నారు.


 
							 
							