పవన్ కల్యాణ్‌కు చంద్రబాబు ఫోన్
టీడీపీ అధినేత చంద్రబాబు పవన్ కల్యాణ్‌తో మాట్లాడారు. విశాఖలో జనవాణి కార్యక్రమం కోసం వెళ్లిన పవన్ కల్యాణ్‌ను పోలీసులు అడ్డుకున్న నేపథ్యంలో, చంద్రబాబు మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకొంది. విపక్ష నేతల పర్యటనలను అడ్డుకోవడం సరికాదన్న చంద్రబాబు, మొత్తం వ్యవహారంలో జనసేనానికి బాసటగా నిలిచారు. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు, పోరాడేందుకు పవన్ కల్యాణ్ కు హక్కు ఉందన్నారు. జనసేన కార్యకర్తలపై కేసులు పెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. విశాఖలో అసలేం జరిగిందన్నదానిపై మొత్తం వివరాలను పవన్ కల్యాణ్ చంద్రబాబుకు వివరించారు. ఇక కార్యక్రమం నిర్వహించకుండా పవన్ కల్యాణ్ హోటల్లోనే ఉండటంతో.. నోవాటెల్ పరిసరాల్లో అభిమానుల కోలాహలం ఎక్కువయ్యింది. అభిమానులను కంట్రోల్ చేయడం పోలీసులకు కష్టంగా మారింది.