సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు-పవన్ కల్యాణ్ చర్చలు
జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, ఉదయం తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుతో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. సీట్ల సర్దుబాటు గురించి ఇద్దరు నేతలు చర్చించారు. ఇప్పటి వరకు టీడీపీ 94, జనసేన 5 సీట్లలో అభ్యర్థుల్ని ప్రకటించగా పొత్తులో భాగంగా జనసేనకు 24 ఎమ్మెల్యే టికెట్లను టీడీపీ ఖరారు చేసింది. అయితే బీజేపీ సీట్ల వ్యవహారం ఇప్పటి వరకు కొలిక్కి రాలేదు. చంద్రబాబు-పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లి మొత్తం సీట్ల సర్దుబాటుపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.


