Andhra PradeshHome Page Slider

టీడీపీ హయాంలో మంచి చేయలేకే చంద్రబాబు మొసలి కన్నీరు

టీడీపీ హయాంలో చేసిన ఒక్క మంచిపని కూడా లేదని ఏపీ సాంఘిక, సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున విమర్శించారు. సీఎం జగన్‌ సంక్షేమ పథకాలు ఇస్తుంటే, చంద్రబాబు ముసలి కన్నీరు కార్చారని మండిపడ్డారు. ఏపీ రాష్ట్రం శ్రీలంక అవుతుందని.. అప్పులపాలు అవుతుందని ప్రచారం చేయించారని, ఇప్పుడు అవే సంక్షేమ పథకాలు తానూ ఇస్తానని కళ్లబొల్లి మాటలు చెబుతున్నారని మంత్రి ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌ సంక్షేమ పథకాలను ఇప్పటి వరకు 99 శాతం మంది అర్హులందరికి అందజేసి.. అర్హత ఉండి సాంకేతిక కారణాలతో మిగిలిపోయిన 1 శాతం లబ్ధిదారులను కూడా కవర్ చేస్తూ 100 శాతం సంక్షేమం అందిచాలనే దిశగా జగనన్న ప్రభుత్వం అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమం శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన సందర్బంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం నాడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తొలి రోజు క్యాంపుల నిర్వహణ తీరును వివరించారు. అవసరమైన వారికి ఉచితంగా సర్టిఫికేట్లను అందిస్తున్న ఘనత సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డికే దక్కుతుందని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. వాలంటీర్లు, సచివాలయ గృహసారథులు ప్రతి ఒక్కరి ఇళ్లకు వచ్చి వారి సమస్యలను తెలుసుకుని టోకెన్లు ఇస్తారని.. ఇక జులై 1 నుంచి 30 వరకు సచివాలయాల పరిధిలో క్యాంపులు పెట్టి.. ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్స్‌, పథకాల లబ్ది, సమస్యలను మండల, సచివాలయ అధికారులు దగ్గరుండి పరిష్కరిస్తారని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి మేరుగ అన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ పారదర్శక పాలనకు నిదర్శనంగా జగనన్న ప్రభుత్వం ఉందన్నారు. జగనన్న సురక్ష పథకాన్ని జులై నెలలో ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశం.. ఈ నెలలోనే విద్యార్థులు కళాశాలలకు వెళ్తారు కాబట్టి వారికి కావాల్సిన సర్టిఫికెట్లను ముందుగానే ఇవ్వడం ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది, దీంతోపాటు సంక్షేమ పథకాలు కూడా ఆగస్టు నుంచే పథకాల క్యాలెండర్‌ అమలవుతుంది.. అందుకని ఈ నెలలో పథకాలకు లింక్‌ చేయాల్సిన సర్టిఫికెట్లను ప్రభుత్వం అందిస్తోంది మాకు ఈ సమస్యలు ఉన్నాయని ప్రజలు అధికారుల వద్దకు వస్తారని, కానీ సీఎం జగన్‌ మాత్రం అధికారులనే ప్రజల వద్దకు పంపి మీ సమస్యలు ఏంటి అని తెలుసుకుని.. వాటిని పరిష్కరించేందుకు క్యాంపులు ఏర్పాటు చేయడం ఇది సుపరిపాలనకు నాంది పలకడమేనని” ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌ పేర్కొన్నారు. రద్దీగా ఉన్న జగనన్న సురక్ష క్యాంపుల్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా వారి భోజన, త్రాగునీరు సదుపాయాలను ప్రభుత్వం కల్పించిందని ఈ పథకాలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.