Andhra PradeshBreaking NewsHome Page Sliderhome page slider

“క్రెడిట్ చోరీలో చంద్రబాబు దిట్ట”

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. “క్రెడిట్‌ చోరీలో మీకు మీరే సాటి” అంటూ ఆయన ఎక్స్ (ట్విట్టర్‌)లో పోస్ట్ చేశారు.

జగన్ వ్యాఖ్యల ప్రకారం —
“వైసీపీ హయాంలో నిర్మాణంలో ఉన్న ఇళ్లను కూడా తామే కట్టేశామని చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు. 3,00,092 ఇళ్లలో ఒక్క ఇంటిపట్టా కూడా ఇవ్వలేదు, ఒక్క ఇల్లూ మంజూరు చేయించలేదు. 1,40,010 ఇళ్లు మా హయాంలోనే పూర్తయ్యే దశలో ఉన్నాయి, మరో 87వేల ఇళ్లు శ్లాబ్‌ లెవల్‌ వరకు నిర్మించినవే” అని వ్యాఖ్యానించారు.

జగన్ ట్వీట్‌తో ఆన్‌లైన్‌లో చర్చ చెలరేగింది. రాజకీయ వర్గాల్లో పరస్పర విమర్శలు మరింత వేడెక్కాయి.