చంద్రబాబుకు సోదరవియోగం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సోదరుడు రామ్మూర్తి నాయుడు (72) నేడు హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసారు. విషయం తెలిసిన చంద్రబాబు ఢిల్లీ టూర్ నుండి హుటాహుటిన హైదరాబాద్ చేరుకోనున్నారు. రామ్మూర్తి నాయుడు గత కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హీరో నారా రోహిత్ ఆయన కుమారుడే. ఆయనకు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా తన కార్యక్రమాలు రద్దు చేసుకుని నేటి ఉదయమే హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన 1994లో టీడీపీ నుండి చంద్రగిరి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.