Andhra PradeshHome Page Slider

తిరుపతికి సీఎం చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతికి బయల్దేరారు. తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలు, గాయపడిన వారిని ఆయన పరామర్శించనున్నారు. తిరుపతి వెళ్లే ముందు ఉండవల్లిలోని తన నివాసంలో అధికారులతో సీఎం సమావేశం నిర్వహించారు. ఘటన అనంతర పరిణామాలు, చేపట్టిన చర్యలపై చర్చించారు. మరోవైపు తిరుపతి జిల్లా కలెక్టర్ పంపిన ప్రాథమిక నివేదికపైనా సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది.