Andhra PradeshHome Page Slider

వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న చంద్రబాబు

వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయటమే లక్ష్యంగా పెట్టుకున్న ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆ దిశగా వ్యూహరచన చేస్తున్నారు. అందులో భాగంగానే తన సొంత నియోజకవర్గంలో లక్ష ఓట్ల మెజార్టీ లక్ష్యంగా ఆయన పావులు కదుపుతున్నారు. గత ఏడాది నుంచి ప్రతి మూడు నెలలకు ఒకసారి తన సొంత నియోజకవర్గంలో పర్యటించి ప్రజలతో మమేకం కావడం మొదలుపెట్టారు. నియోజకవర్గ బాధ్యులుగా ఉన్న వారిని పార్టీ శ్రేణులు చేసిన విమర్శల ఆధారంగా పక్కన పెడతానని హామీలు ఇచ్చి సముదాయించారు. లక్ష ఓట్ల మెజార్టీ లక్ష్యసాధన కోసం ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ చైర్మన్ గా ఇటీవల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా గెలిచిన కంచర్ల శ్రీకాంత్ నియమించారు. ఆ కమిటీ ఆధ్వర్యంలో అనుసరించాల్సిన కార్యాచరణ ప్రణాళికను అమలు నిర్దేశించడానికి నేటి నుండి మూడు రోజుల పర్యటన కోసం చంద్రబాబు కుప్పం వెళ్తున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా నియోజకవర్గంలోని మండల స్థాయి గ్రామస్థాయి పార్టీ నాయకులతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించనున్నారు. ఆ సందర్భంగా లక్ష మెజార్టీ సాధనకు అనుసరించాల్సిన విధానాలతో పోలింగ్ బూత్ స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలతో దిశా నిర్దేశం చేయనున్నారు ఈ సందర్భంగానే ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో అంతర్గత విభేదాలున్న నియోజకవర్గాలలో పార్టీ నాయకుల మధ్య సమన్వయ సమావేశాలు నిర్వహించనున్నారు. మొత్తం మీద అధికార పార్టీ నేతలు నుంచి పెరుగుతున్న ఒత్తిడిని అధిగమించి వచ్చే ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజార్టీ సాధించడమే లక్ష్యంగా చంద్రబాబు మూడు రోజుల కుప్పం పర్యటన కొనసాగనుంది.