Andhra PradeshHome Page Slider

చంద్రబాబు ప్రజల్నే కాదు, కోర్టులనూ మోసం చేస్తున్నారు

•బడుగు బలహీనవర్గాలు ఆర్థిక పురోగతి సాధించాలనే సంక్షేమ పథకాలు – మంత్రి మేరుగ నాగార్జున
•వెలిగొండ ప్రాజెక్టుతో పశ్చిమ ప్రకాశం సస్యశ్యామలం – ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి

ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం సామాజిక సాధికార బస్సుయాత్ర జరిగింది. సాయంత్రం 5 గంటలకు మార్కాపురం పట్టణంలోని వైఎస్సార్‌ విగ్రహం వద్ద భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా నాయకులు ఏమన్నారంటే..

ఇది జవాబుదారీ ప్రభుత్వం – కుందూరు నాగార్జున రెడ్డి

ఈ నాలుగున్నరేళ్ల పాలనలో ప్రతి ఒక్కరి ఇంటికే సంక్షేమ పథకాలు అందించారు మన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, ఇందులో పార్టీ లేదు, కులం, మతం, వర్గం చూడకుండా అర్హతే ప్రామాణికంగా పథకాలు ఇచ్చిన నాయకుడు సీఎం జగన్‌ అని మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి తెలిపారు. ఆ నాడు దివంగత నాయకుడు వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పశ్చిమ ప్రకాశంలో నీటి సమస్యను తీర్చేందుకు వెలిగొండ ప్రాజెక్టును తీసుకొచ్చారని ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి పేర్కొన్నారు. ఇక ఆ మహానేత తనయుడిగా సీఎం జగన్‌ పశ్చిమ ప్రకాశంలో ఓ మెడికల్‌ కళాశాలను మంజూరు చేసి వెంటనే దానికి నిధులు కూడా ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. ఇక మార్కాపురంలో రూ. 1700 వందల కోట్లతో సంక్షేమ పథకాలు, అభివృద్ది పనులు చేపట్టామన్నారు. పొదిలి పెద్దచెరువు ప్రాజెక్టుకు రూ.22 కోట్లను సీఎం జగన్‌ మంజూరు చేశారు. దీంతో మార్కాపురంలో నీటి సమస్య పూర్తిగా నివారించగలిగామని ఎమ్మెల్యే నాగార్జున తెలిపారు. సీఎం జగన్‌ పాలన జవాబుదారీ పాలన అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

పేద ప్రజల గుండె చప్పుడు సీఎం వైఎస్‌ జగన్‌ – మంత్రి మేరుగ నాగార్జున

చంద్రబాబు 14ఏళ్ల పాలనలో దళితులు, బీసీలు నలిగిపోయారని మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు. రాజ్యాంగబద్దంగా బడుగు బలహీన వర్గాలకు రావాల్సిన అధికారాలను చంద్రబాబు దుర్వినియోగం చేశారని మంత్రి తెలిపారు. అదే సీఎం జగన్‌ ఇవాళ సంక్షేమ పథకాలను తీసుకొచ్చి బడుగు బలహీనవర్గాలు ఆర్థిక పురోగతి సాధించాలని ఆకాంక్షిస్తున్నారని మంత్రి నాగార్జున స్పష్టం చేశారు. సీఎం జగన్‌ పేద ప్రజల గుండె చప్పుడు అని, ఆయన పరిపాలన సువర్ణ అక్షరాలతో లిఖించదగినదని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు పెద్ద మోసగాడని, రానున్న రోజుల్లో అబద్దాలు చెప్పి అధికారంలోకి రావాలని చూస్తున్నారని, వారి మోసాలను నమ్మి మోసపోవద్దని మంత్రి మేరుగ సూచించారు. గతం ఎన్నికల్లో చంద్రబాబు 650 హామీలు ఇచ్చి, రైతులు, ప్రజలను ఏవిధంగా మోసం చేశారో అందరికీ తెలుసునన్నారు.

దళితులకు పదవులిచ్చి సాధికారత తీసుకొచ్చారు. – మంత్రి ఆదిమూలపు సురేష్‌

రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు మూడున్నర కోట్ల మంది ఉన్నారని మరి గతంలో వీరిని చంద్రబాబు ఓటు బ్యాంకుగానే చూశారని, అదే సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి వారి జీవితాలను మార్చాలని రాజ్యంగ పదవులు ఇచ్చారని, అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. వెనుకబడిన ప్రాంతంగా పిలిచే మార్కాపురంలో ఓ మెడికల్‌ కళాశాల వచ్చింది అంటే దానికి కారణం సీఎం జగన్‌ అని పేర్కొన్నారు. అంతేకాకుండా ఇక్కడిఏ రైతులకు చేయూత ఇవ్వాలని వెలిగొండ ప్రాజెక్టును కూడా త్వరలో పూర్తి చేసి తాగు,సాగు నీరు అందిస్తామని మంత్రి తెలిపారు. దళితులను గతంలో ఆలయాల్లోకి రాణించేవారు, ఊరిచివర్లో బతికేవారు కానీ నేడు ఆ పరిస్థితి లేదని, దళితులను ప్రోత్సహించి వారికి పదవులు అంబేద్కర్‌ ఇచ్చిన రాజ్యాంగాన్ని అమలు చేసిన వ్యక్తి సీఎం జగన్‌ అని మంత్రి సురేష్‌ స్పష్టం చేశారు. చంద్రబాబు తాజాగా కోర్టుకు అబద్దాలు చెప్పి, మోసం చేసి బెయిల్‌ తెచ్చుకుని బయట తిరుగుతున్నారని, ఆయన ఆరోగ్యం బాగుందని కావాలని విషప్రచారం చేశారని మంత్రి సురేష్‌ తెలిపారు. అలాంటి వ్యక్తులను ప్రజలు దూరం పెట్టాలని, రానున్న రోజుల్లో సీఎం జగన్‌కు అండగా నిలవాలన్నారు.