Andhra PradeshBreaking Newshome page sliderHome Page SliderNewsNews AlertPolitics

చంద్రబాబు కామన్ మెన్ కాదు.. క్యాపిటలిస్ట్ మెన్

రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలనే నిర్ణయాన్ని వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రంగా ఖండించారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జిల్లాల పునర్విభజన తరువాత ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలనే ఉద్దేశంతోనే వైఎస్ జగన్ ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీల నిర్మాణం ప్రారంభించిందని గుర్తుచేశారు.“8500 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీల నిర్మాణం ప్రారంభించారు. పేదవాడికి కార్పొరేట్ స్థాయి వైద్యం ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టులు చేపట్టారు. ప్రతి ఇంటి నుంచి ఒక డాక్టర్ రావాలని వైఎస్ జగన్ ఆశించారు,” అని అన్నారు.రాష్ట్ర విభజన వరకు కేవలం 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయని, జగన్ ముఖ్యమంత్రిగా వచ్చిన తరువాత 17 కొత్త కాలేజీల పనులు ప్రారంభించారని, దాంతో సుమారు 4,500 కొత్త మెడికల్ సీట్లు లభించే అవకాశం ఉందని వివరించారు. “కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరించడం తప్ప ఆయనకు ప్రజల కష్టాలు పట్టవు . అప్పు చేసిన రెండు లక్షల కోట్లలో ఐదు వేల కోట్లు మెడికల్ కాలేజీలకు కేటాయిస్తే నిర్మాణం పూర్తి చేయొచ్చు. కానీ ఆయనకు సామాన్యుల కంటే క్యాపిటలిస్ట్ ల ప్రయోజనమే ముఖ్యమైంది,” అని మండిపడ్డారు.నర్సీపట్నం మెడికల్ కాలేజీ విషయానికొస్తే, ఇప్పటికే హాస్పిటల్ భవనం మూడు అంతస్తులు పూర్తయ్యాయని, 50 కోట్లకు పైగా ఖర్చు అయినట్లు గుర్తుచేశారు. “ఇంత వరకు నిర్మాణం జరిగిపోయిన భవనాన్ని పూర్తి చేయడంలో ఇబ్బంది ఏమిటి? స్పీకర్ అయ్యన్న ఈ బాధ్యత తీసుకోవాలి,” అని డిమాండ్ చేశారు. “చంద్రబాబు కామన్ మెన్ కాదు.. క్యాపిటలిస్ట్ మెన్. గూగుల్‌లో చూసినా ఆయనకు ‘సైకో’ కంటే పెద్ద పేరు వస్తుంది. కిమ్ ఉత్తర కొరియా నియంత అయితే, లోకేష్ ఆంధ్రప్రదేశ్ నియంత” అంటూ వ్యాఖ్యానించారు.
“ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం చేపడతాం. వైఎస్ జగన్ హామీ ఇచ్చినట్లుగానే భవిష్యత్తులో వీటిని తిరిగి ప్రభుత్వ పరంగా మార్చుతాం,” అని స్పష్టం చేశారు.