Home Page SliderTelangana

చంద్రబాబు గారు మీ శిష్యుడికి అవగాహన కల్పించండి..

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా ఓ ఆసక్తికర పోస్టు చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత దశాబ్దకాలంగా ప్రగతిశీల ప్రభుత్వ విధానాల వల్ల దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందని కేటీఆర్ అన్నారు. ఈ విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అనేక సందర్భాల్లో ప్రస్తావించారని గుర్తు చేస్తూ ఆయన మాట్లాడిన వీడియోను ‘ఎక్స్’ వేదికగా కేటీఆర్ పోస్ట్ చేశారు. “థ్యాంక్యూ చంద్రబాబు గారూ.. దయచేసి ఈ వాస్తవాన్ని జీర్ణించుకోలేని మీ పూర్వ శిష్యుడికి దీనిపై అవగాహన కల్పించండి” అని ట్వీట్ లో పేర్కొన్నారు.