Andhra PradeshHome Page Slider

చంద్రబాబు భవిష్యత్తుకు గ్యారెంటీ… మరోసారి జిల్లాల పర్యటన

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతో మినీ మేనిఫెస్టో ను ప్రకటించారు. ప్రభుత్వ వైఫల్యాలని ఎండగడుతూ మరోసారి జిల్లాల పర్యటనకు సమాయత్తమవుతున్నారు. జోన్లవారీగా తెలుగుదేశం పార్టీ బస్సు యాత్రలు నిర్వహిస్తూ ప్రజల్లోకి మ్యానిఫెస్టోను బలంగా తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తోంది. త్వరలోనే చంద్రబాబు పర్యటన షెడ్యూల్ ను పార్టీ యంత్రాంగం ఖరారు చేయనుంది. జూలై నెల మొదటి వారంలో భవిష్యత్తుకు గారెంటీ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించనున్న బహిరంగ సభలు, రోడ్డు షోలలో చంద్రబాబు పాల్గొననున్నారు. దీనికి సంబంధించిన రోడ్డు మ్యాప్ ను తెలుగుదేశం పార్టీ నేతలు రూపొందిస్తున్నారు.